SLP Filed by Chandrababu On Skill Development Case Will Come Before Supreme Court Today



SLP Filed by Chandrababu On Skill Development Case Will Come Before Supreme Court Today

SLP Filed by Chandrababu On Skill Development Case Will Come Before Supreme Court Today

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద….. గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా..స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వేసిన S.L.P……. నేడు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. తన పిటిషన్ ను గత శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి కొట్టేయడాన్ని సవాలు చేస్తూ… చంద్రబాబు S.L.P వేశారు. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ D.Y.చంద్రచూడ్ ధర్మాసనం ముందు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఈ కేసును మెన్షన్ చేశారు. అత్యవసరత ఉన్నందున ఈ కేసుకు సంబంధించి మెన్షనింగ్ స్లిప్ ఇచ్చామని, పిటిషనర్ కస్టడీలో ఉన్నారని, ఇది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కేసని, అక్కడ ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై C.J.I స్పందిస్తూ మంగళవారం రావాలని సూచించారు. చంద్రబాబు ఎప్పటినుంచి కస్టడీలో ఉన్నారని ప్రశ్నించారు. 8న ఆయన్ను అరెస్టు చేసినట్లు సిద్ధార్థ లూథ్రా చెప్పారు. సెప్టెంబర్ 8 నుంచా అని ప్రశ్నిస్తూ… మంగళవారం మెన్షనింగ్ లో రండి, ఏం చేయాలన్నది చూస్తామంటూ C.J.I విచారణను ముగించారు
—————————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-