NITI Aayog Team Met CM Jagan | Development of Vizag Under Urbanization & Industrialization



NITI Aayog Team Met CM Jagan | Development of Vizag Under Urbanization & Industrialization

NITI Aayog Team Met CM Jagan | Development of Vizag Under Urbanization & Industrialization

నగరీకరణ, పారిశ్రామికీకరణ అంశాల్లో దేశంలో ఎంపిక చేసిన 4 నగరాల్లో విశాఖకు చోటు కల్పించడం శుభపరిణామమని నీతిఆయోగ్ ప్రతినిధులతో సీఎం జగన్ పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని నీతిఆయోగ్ అదనపు కార్యదర్శి వి.రాధ, ఇతర ప్రతినిధులు కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై సీఎం వారితో చర్చించారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, ఎయిర్ పోర్ట్-సీపోర్ట్ కనెక్టివిటీ రోడ్ , డేటా సెంటర్ , మూలపేట పోర్ట్ , ఇనార్బిట్ మాల్ ఇలా అనేక విధాలుగా విశాఖను అభివృద్ధి చేసి అంతర్జాతీయంగా గుర్తింపు పొందే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. ఏపీలో నూతనంగా నిర్మిస్తున్న సీపోర్టులు, వ్యవసాయం, వైద్యరంగం, నవరత్నాలు, ఆర్బీకేలు, గ్రామ,వార్డు సచివాలయాలపై సమావేశంలో చర్చించారు. అభివృద్ధి అంశాలపై సమగ్ర నివేదిక అందించాలని నీతిఆయోగ్ బృందం కోరింది. రాష్ట్రానికి అవసరమైన సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని నీతిఆయోగ్ బృందం వెల్లడించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–