Jio's 5G Network Now Covers All District Headquarters In Gujarat | గుజరాత్ లో ట్రూ 5జీ సేవలు



Jio's 5G Network Now Covers All District Headquarters In Gujarat | గుజరాత్ లో ట్రూ 5జీ సేవలు

Jio's 5G Network Now Covers All District Headquarters In Gujarat | గుజరాత్ లో ట్రూ 5జీ సేవలు

గుజరాత్ లోని 33 జిల్లా కేంద్రాలకు ట్రూ 5జీ సేవలు అందిస్తున్నామని రిలయన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో ఈ సేవలు దేశంలోని 10 ప్రాంతాలకు విస్తరించినట్లైంది. మోడల్ స్టేట్ కింద గుజరాత్ లోని విద్యా, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు సహా చాలా రంగాల్లో జియో సేవలు అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్తులో ఈ సేవలను దేశం మొత్తం విస్తరించనున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ చేపట్టిన ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ కార్యక్రమం కింద తొలుత 100 పాఠశాలలను డిజిటలైజేషన్ చేయనున్నారు. అన్ని జిల్లా కేంద్రాలు 5జీకి అనుసంధానమైన తొలిరాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. నవంబర్ 23 నుంచి జియో ట్రూ 5జీ సేవలు 1జీబీపీఎస్ వేగంతో పుణెలో అందుబాటులోకి వచ్చాయి. గత వారం దిల్లీ ఎన్ సీఆర్ ప్రాంతంలో గురుగ్రామ్ , నోయిడా, ఘజియాబాద్ , ఫరీదాబాద్ ఇతర ప్రధాన ప్రాంతాల్లో కూడా మొదలయ్యాయి. ఇక ఈ నెల రెండో వారంలో హైదరాబాద్ , బెంగళూరుల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. సేవల్లో నాణ్యత కోసమే ట్రూ-5జీ సేవలను వివిధ నగరాల్లో దశలవారీగా ప్రారంభిస్తున్నట్లు జియో వెల్లడించింది. జియో ట్రూ-5జీ వెల్ కమ్ ఆఫర్ లో భాగంగా, ప్రస్తుత వినియోగదార్లు ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా 1జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా పొందొచ్చని పేర్కొంది.
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————- .